: సస్పెన్షన్ చేయించుకోవడానికే కాంగ్రెస్ సభ్యులు సభకు వచ్చినట్టుంది: కేసీఆర్
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్యులు సస్పెన్షన్ చేయించుకోవడానికే సభకు వచ్చినట్టుందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు.