: ఇండియాలో 30 కోట్లు దాటనున్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య


ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నవారి సంఖ్య 30 కోట్లను దాటుతుందని ఐఏఎంఏఐ (ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ అఫ్ ఇండియా) ప్రకటించింది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం విస్తరిస్తున్న కొద్దీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆ సంస్థ వివరించింది. జనవరి నాటికి చైనా తరువాత అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్న దేశంగా ఇండియా నిలవనుందని అంచనా వేసింది. కాగా, ప్రస్తుతం చైనాలో 60 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇండియాలో నెట్ వాడుతున్నవారి సంఖ్య కోటి నుంచి 10 కోట్లకు చేరడానికి 10 సంవత్సరాలు పడితే, అక్కడినుంచి 20 కోట్లకు చేరడానికి మూడేళ్ళు, 30 కోట్లకు చేరడానికి ఒక సంవత్సరం మాత్రమే పట్టింది.

  • Loading...

More Telugu News