: రాంపాల్ ఆశ్రమంలో ఆరు మృత దేహాలు... బాబాపై దేశద్రోహం కేసు నమోదు


హర్యానాలోని బాబా రాంపాల్ ఆశ్రమంలో ఆరుగురు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. వీరిలో నలుగురు మహిళలేనని, వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని హర్యానా డీజీపీ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఏ కారణంగా సదరు మహిళలు మరణించారన్న విషయం తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు. ఆశ్రమంలో ఆరుగురు చనిపోయిన నేపథ్యంలో తక్షణమే లొంగిపోవాలని బాబా రాంపాల్ కు డీజీపీ సూచించారు. దేశ ద్రోహం నేరం కింద కేసు నమోదు చేశామని, వెంటనే లొంగిపోవాలని కూడా డీజీపీ హెచ్చరించారు. బాబా రాంపాల్ తో పాటు సత్ లోక్ ఆశ్రమ అధికార ప్రతినిధి రాజ్ కపూర్, బాబా ముఖ్య అనుచరుడు పురుషోత్తం దాస్ లపైనా ఇవే అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News