: నాడు నేను చెప్పినవే ఇప్పుడు జరుగుతున్నాయి: మాజీ సీఎం కిరణ్
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చాలా రోజుల తరువాత మీడియా ముందుకొచ్చారు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభజన అనంతరం పరిణామాలపై మాట్లాడమని మీడియా ఆయనను కోరింది. అందుకు కిరణ్ స్పందిస్తూ, రాష్ట్ర విభజనవల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయని తాను చెప్పానో, ఇప్పుడవే జరుగుతున్నాయని అన్నారు. ఒకసారి ఎవరికివారు పరిశీలించుకోవాలన్నారు. విద్యుత్ కష్టాలు, నీటి తగాదాలు తలెత్తుతాయని అసెంబ్లీలో, బహిరంగ సభల్లో తాను ఏకరవు పెట్టానని గుర్తు చేశారు.