: ఇండోర్ లో కూలిన శిక్షణ విమానం


మధ్య ప్రదేశ్ ఫ్లైయింగ్ క్లబ్ కు చెందిన శిక్షణ విమానం అదుపుతప్పి కూలిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే సరిహద్దు గోడ వద్ద కూలిపోయిందని ఎస్పీ అబిద్ ఖాన్ తెలిపారు. విమానంలో ఉన్న ఇద్దరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News