: ట్రైబ్యునల్ ముందు తానే వాదిస్తానంటున్న కేసీఆర్
నేటి అసెంబ్లీ సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అవసరమైతే, ట్రైబ్యునల్ ముందు ఈ అంశంపై తానే వాదిస్తానన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సమైక్య పాలకులు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు విభేదాలు మరచి ముందుకు రావాలని సూచించారు. నీటి విషయంలో తమ వాటాను సాధించుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే, భవిష్యత్ తరాలకు నష్టం తప్పదని కేసీఆర్ హెచ్చరించారు.