: ఏపీ రాజధాని భూ సమీకరణకు చట్టబద్ధత: మంత్రి రావెల
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించనున్నట్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. చట్టబద్ధత కోసం విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి, దానిపైన రాజధాని భూ సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం చర్చించినట్టు వివరించారు. ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం మంత్రి కిశోర్ బాబు మీడియాకు పలు విషయాలు తెలిపారు. రాజధాని భూసేకరణ విషయంలో క్షేత్ర స్థాయిలో రైతులు, గ్రామస్థులతో మాట్లాడుతున్నామన్నారు. రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దీనిపై మరోసారి ల్యాండ్ పూలింగ్ కమిటీ సమావేశమై చర్చిస్తుందని మంత్రి చెప్పారు.