: అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్లో 4.5 లక్షల మంది భారతీయులేనట!


అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 4.5 లక్షలని ఆ దేశం ప్రకటించింది. గత ఐదేళ్లుగా అక్రమ వలసదారుల సంఖ్యలో మార్పు లేదని తెలిపింది. 2012 నాటికి అమెరికాలో 1.12 కోట్ల మంది అనుమతులు లేకుండా నివసిస్తున్నారని పేర్కొంది. న్యూ హాంప్ షైర్ ప్రాంతంలో ఇండియా నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అధికంగా ఉన్నారని ఓ అమెరికా సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. భారత్ నుంచి వచ్చి వీసా గడువు పూర్తయినా వెళ్ళకుండా అక్రమంగా ఉన్నవారు మిచిగాన్ లో 14 శాతం, మిన్నెసోటాలో 9 శాతం, న్యూజెర్సీలో 11 శాతం, ఒహియోలో 11 శాతం, వాషింగ్టన్ లో 5 శాతం మంది ఉన్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News