: ఏపీలో వైద్యుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్: మంత్రి కామినేని


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. దాని ద్వారా 350 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎం అండ్ హెచ్ వో)ల ప్రక్షాళనకు చర్యలు చేపట్టామని తెలిపారు. 108 సర్వీసుల నిబంధనలపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కామినేని చెప్పారు.

  • Loading...

More Telugu News