: ఇంటిపై కూలిన విమానం
అదుపు తప్పిన ఓ చిన్న విమానం ఇంటిపై కూలిపోయిన సంఘటన అమెరికాలోని షికాగో నగరంలో జరిగింది. ఈ ప్రమాదం అర్థరాత్రి 2:40 గంటల సమయంలో జరగ్గా, ఇంట్లో నిద్రిస్తున్నవారు కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విమానం లివింగ్ రూంపై కూలిందని, అందువల్లే ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మిడ్ వే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయని పైలెట్ సమాచారం ఇచ్చాడని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.