: కాల్పుల ఘటన దురదృష్టకరం: సీఎం కేసీఆర్


హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల ఘటన దురదృష్టకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పందించిన కేసీఆర్, ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై గురువారం సభలో చర్చ పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కాల్పుల ఘటనపై సభలో సవివర ప్రకటన చేస్తామని కూడా ఆయన చెప్పారు. అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి కేబీఆర్ పార్కు వద్ద కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News