: మహిళలు జీన్స్, మొబైల్ ఫోన్లు వాడటంపై నిషేధం: యూపీలో కుల పంచాయితీ నిర్ణయం
మహిళలు జీన్స్ ప్యాంటులు ధరించరాదని, మొబైల్ ఫోన్లు వాడకూడదని ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలో సమావేశమైన ఓ కుల పంచాయతీ ఆదేశించింది. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి సోషల్ నెట్వర్క్ లను ఎవరూ వాడవద్దని, తమ ఆదేశాలు ముజఫర్ నగర్ పరిధిలోని 46 గ్రామాల్లో అమలు చేయాల్సిందేనని పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. ఇటువంటి తాలిబాన్ తరహా నిర్ణయాలను యూపీలోని కుల పంచాయతీలు వెలువరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు కుల పెద్దలు మహిళలపై ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లోని గుజ్జర్, యాదవుల సంఘాలు ఇవే తరహా నిర్ణయాలు వెలువరించాయి.