: టాలీవుడ్ హీరో వెంకటేశ్ కు నోటీసులు
ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్లాటులో అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణల మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఫిలింనగర్ లోని వెంకటేశ్ ప్లాటులో కొన్ని రోజులుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి ఎలాంటి అనుమతి తీసుకోలేదనీ, దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో జీహెచ్ఎంసీ కోరింది. 10 రోజుల్లోగా వెంకటేశ్ నుంచి సమాధానం రాకపోతే, ఆ నిర్మాణాలను అక్రమ నిర్మాణాలుగా పరిగణించి కూల్చివేస్తామని అధికారులు తెలిపారు.