: బలవంతంగా నిర్బంధించారు!: బాబా రాంపాల్ ఆశ్రమం నుంచి బయటపడ్డ 10 వేల మంది
వివాదాస్పద గురు బాబా రాంపాల్ ఆశ్రమం నుంచి నేటి ఉదయం సుమారు 10 వేల మంది బయటకు వచ్చారని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చాలా మంది ఆశ్రమం లోపల ఉన్నారని, వారిని బలవంతంగా రాంపాల్ అనుచరులు నిర్బంధించారని తెలిపారు. కాగా, రాంపాల్ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయేందుకు ఉదయం 10 గంటల వరకు సమయమిచ్చిన హర్యానా పోలీసులు మరోసారి 'ఆపరేషన్ అరెస్ట్'ను ప్రారంభించారు. అసలు రాంపాల్ ఆశ్రమం లోపల ఉన్నాడా? లేడా? అన్నది కూడా తెలియడంలేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, బాబా రాంపాల్, ఆయన అనుచరులపై బర్వాలా పోలీసు స్టేషన్ లో మరో కేసును నమోదు చేసినట్టు తెలుస్తోంది.