: అర్హులందరికీ పింఛన్లు వచ్చేదాకా పోరు సాగిస్తాం: డీకే అరుణ


రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యేదాకా ప్రభుత్వంపై పోరు సాగిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో వృద్ధులు గుండెపగిలి ప్రాణాలు విడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధుల మరణాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం చర్చకు అనుమతించాల్సిందేనన్నారు. ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని విడనాడి విపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News