: సభలో నేడూ వాయిదాల పర్వమే...ప్రారంభమైన వెంటనే వాయిదా
తెలంగాణ శాసన సభలో బుధవారం కూడా వాయిదాల పర్వమే కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన శాసన సభ సమావేశాలు 10 నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. గడచిన రెండు రోజులుగా పార్టీ ఫిరాయింపులపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్, నేడు వృద్ధుల హఠాన్మరణాలపై చర్చ కోసం బీష్మించింది. పింఛన్లు అందక తీవ్ర వేధనతో గుండె పగిలి చనిపోతున్న వృద్ధుల అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆ పార్టీ చర్చకు అనుమతించాల్సిందేనని వాదించింది. సభ ప్రారంభం కాగానే విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ సభ్యులు పొడియంను చుట్టుముట్టి, తమ వాయిదా తీర్మానంపై చర్చకు అనుతించాలని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.