: పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరంజీవి!


భారత బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ బాటలోనే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. సచిన్ నెల్లూరు జిల్లాలోని పుట్టం రాజు కండ్రిగ గ్రామాన్ని అభివృద్ధి నిమిత్తం దత్తత తీసుకోవడం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ గ్రామం చిరంజీవి స్వస్థలం మొగల్తూరుకు సమీపంలోనే ఉంటుంది. త్వరలోనే చిరు ఈ గ్రామాన్ని సందర్శించి, గ్రామాభివృద్ధికి ఏం కావాలో పరిశీలించనున్నారట. సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద ప్రతి ఎంపీ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాని పురోగతికి పాటుపడవచ్చు.

  • Loading...

More Telugu News