: అంకెలను గుర్తించడానికి మెదడులో ఓ పార్ట్ ఉందా?
ఉందనే అంటున్నారు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మెదడు కార్టెక్స్ ఉపరితలంలో ఉండే 10-20 లక్షల నాడీ కణాలు కలిసి ప్రత్యేకించి అంకెలను విపులంగా గుర్తించే క్వాలిటీని కలిగిఉంటాయిట. అంకెలు పుట్టకముందే మెదడు పుట్టింది కదా.. అనడిగితే మనం చెప్పలేం గానీ.. అంకెలను విశ్లేషించడానికి ప్రత్యేకమైన నాడీకణాల సముదాయం ఉన్నట్లు తేలడమే కొత్త విషయమని ఈ స్టడీ నిర్వహించిన జోసెఫ్ పర్విజి చెప్పారు. ఒకేతీరులో కనిపించే ఇతర సంకేతాల కంటె కూడా ప్రత్యేకించి అంకెలను గుర్తించడంలో ఈ మెదడు కణాలు ఎక్కువ స్పందిస్తున్నాయని ఆయన గుర్తించారు. అక్షరాలను గుర్తించడంలో తికమకపడే డిస్‌లెక్సియా బాలలను ట్రీట్ చేయడంలో ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంటున్నారు.