: మామాఅల్లుళ్లపై గవాస్కర్ ఫైర్
ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముద్గల్ కమిటీ రిపోర్టు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో మాజీ సారథి సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ, శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పై చట్టాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించాలన్నాడు. ఫిక్సింగ్ వ్యవహారంపై శ్రీనివాసన్ మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించాడీ దిగ్గజ ఓపెనర్. ఐపీఎల్లో ఆటగాళ్లు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి కూడా ఎందుకు నోరు విప్పలేదని నిలదీశాడు. శ్రీనివాసన్ ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన అవసరముందన్నారు. ఐపీఎల్ ఫిక్సింగ్ గురించి శ్రీనివాసన్ కు తెలుసని ముద్గల్ కమిటీ నివేదికలో ఉందని కథనాలు వస్తున్నాయని గవాస్కర్ తెలిపారు. ఎవరైనా ఆటగాడు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు తేలితే అతడిని జైలుపాలు చేయాలని, అతడి క్రికెట్ చరిత్రను రికార్డు పుస్తకాల నుంచి తొలగించాలని సూచించారు.