: భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఖతార్ ఎయిర్ వేస్
దోహా నుంచి కార్యకలాపాలు సాగించే ఖతార్ ఎయిర్ వేస్ బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్లో భారత ప్రయాణికులు ఓ బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే మరో బిజినెస్ క్లాస్ టికెట్ ఉచితంగా ఇస్తారు. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 'డబుల్ ద లగ్జరీ' పేరిట ప్రవేశపెట్టిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ఎంపిక చేసిన గమ్యస్థానాలకు మాత్రమే వర్తిస్తుంది. భారత్ లోని 12 నుంచి నగరాల నుంచి న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, షికాగో, డల్లాస్, హూస్టన్, మయామి, లండన్, పారిస్, రోమ్ తదితర నగరాలకు ఖతార్ ఎయిర్ వేస్ సర్వీసులు నడుపుతోంది. తమ నూతన ఆఫర్ తో బిజినెస్ క్లాస్ ప్రయాణానికి గిరాకీ పెరుగుతుందని ఖతార్ ఎయిర్ వేస్ భారత ఉపఖండం విభాగం వైస్ ప్రెసిడెంట్ ఇహాబ్ సొరియాల్ అన్నారు.