: నటుడు జాకీ ష్రాఫ్ భార్యకు బెదిరింపు సందేశాలు


బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు సందేశాలు వస్తుండడంతో పోలీసులను ఆశ్రయించారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో ఆమె ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆయేషా ష్రాఫ్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఓ అధికారి తెలిపారు. కాగా, ఆయేషా కిందటి నెల తన మాజీ వ్యాపార భాగస్వామి సాహిల్ ఖాన్ పై ఫిర్యాదు చేశారు. రూ. 5 కోట్ల మేర మోసగించాడని తన ఫిర్యాదులో ఆరోపించారు.

  • Loading...

More Telugu News