: లాలూ ఎక్స్ పైర్ అయిన మెడిసిన్ లాంటి వాడు: పాశ్వాన్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నారై (నాన్ రెసిడెంట్ ఇండియన్)లా తయారవుతున్నారని లాలూ వ్యాఖ్యానించడం పట్ల పాశ్వాన్ స్పందించారు. లాలూ ఎక్స్ పైర్ (కాలం తీరిన) అయిన మెడిసిన్ లాంటివాడని అభివర్ణించారు. అటు పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కూడా లాలూపై వ్యాఖ్యానించారు. లాలూకు సుస్తీ చేసినట్టుందని, ఆయన విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతకుముందు, ప్రధాని విదేశీ పర్యటనలపై రాంచీలో లాలూ మాట్లాడుతూ, మోదీ ఇప్పుడు ఎంతమాత్రం భారత్ కు ప్రధాని కాదని, ఎన్నారై అయ్యారని వ్యాఖ్యానించారు. ఓవైపు దేశ సరిహద్దుల వద్ద వివాదాలు కొనసాగుతున్నా, విదేశాల్లో మోదీ ప్రజాదరణ ఆకాశాన్నంటుతుందంటూ మీడియా చిత్రీకరిస్తోందని విమర్శించారు.