: నెహ్రూను చరిత్ర నుంచి తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు: రాహుల్
జవహర్ లాల్ నెహ్రూపై ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. మంగళవారంతో ముగిసిన ఈ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెహ్రూను చరిత్ర నుంచి తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్య చేశారు. గొప్ప ఆలోచనలకు నెహ్రూ ప్రతిరూపం అని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ, నెహ్రూ సిద్ధాంతాలకు ప్రస్తుత కాలంలో సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ సదస్సుకు 20 దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.