: టీఎస్ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు
తెలంగాణ రాష్ట్ర మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు రానున్నాయి. మావోయిస్టుల కదిలికలు ఎక్కువయ్యాయంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో... మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాదులోనే కాకుండా, ఇతర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా మంత్రులంతా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మాత్రమే వాడాలని పోలీసులు సూచించారు.