: అర్పిత భర్తకు ఖరీదైన షేర్వాణీ బహూకరించనున్న హైదరాబాదీ... ధర చెప్పరట!


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం ఢిల్లీ వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో నేడు హైదరాబాదులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, వరుడు ఆయుష్ శర్మకు హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత మఖ్దూం బ్రదర్స్ వస్త్రదుకాణం వారు ఓ ఖరీదైన షేర్వాణీని బహూకరించనున్నారు. ఆస్ట్రియా నుంచి తెప్పించిన స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ ను దీనిపై పొదిగారు. ఈ పసిడి వన్నెల షేర్వాణీని జమావర్ అనే ప్రత్యేక వస్త్రంతో రూపొందించడం విశేషం. నలుగురు వర్కర్లు పదిహేను రోజుల పాటు శ్రమించి ఈ షేర్వాణీకి ఓ రూపు తెచ్చారని మఖ్దూం బ్రదర్స్ లో ఒకరైన అబిద్ మొహియుద్దీన్ తెలిపారు. సల్మాన్ కుటుంబం హైదరాబాదుకు వస్తారన్నప్పటి నుంచే, వారికో బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే, తాము రూపొందించిన షేర్వాణీ ధర చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అన్నట్టు, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా వివాహం సందర్భంగా ఆమె భర్త షోయబ్ మాలిక్ కు కూడా మఖ్దూం బ్రదర్స్ నుంచే షేర్వాణీలు వెళ్లాయి.

  • Loading...

More Telugu News