: పురుషుల హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ మరోసారి రాజీనామా
పురుషుల హాకీ కోచ్ టెర్రీ వాల్ష్ మరోసారి రాజీనామా చేశాడు. రెండు నెలల కిందట తొలిసారి రాజీనామా చేసిన టెర్రీ మళ్లీ వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనపై హాకీ ఇండియా మాత్రం గుర్రుగానే ఉంది. ఈ క్రమంలో నిన్న (సోమవారం) ఆరుగంటల పాటు జరిగిన దేశ ప్రత్యేక స్పోర్ట్స్ అథారిటీ కమిటీ మీటింగులో, వాల్ష్ కోచ్ గా ఉన్న కాలంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని హాకీ ఇండియా అధ్యక్షుడు నరిందర్ బాత్రా విమర్శించారట. దాంతో, తనను కోచ్ గా కొనసాగించేందుకు హాకీ ఇండియా ఇష్టపడటంలేదని తెలుసుకుని పదవి నుంచి వైదొలిగాడు.