: ఇండియా టూర్ ఓ పీడకల: సనత్ జయసూర్య


ఇటీవల ముగిసిన భారత పర్యటన తమకు ఓ పీడకల వంటిదని, దాన్ని ఎంత త్వరగా మరచిపోతే అంత మంచిదని శ్రీలంక క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య అభిప్రాయపడ్డారు. భారీ మార్జిన్ల తేడాతో ఓటమి పాలు కావడం, ఒక్క మ్యాచ్ లో అయినా విజయం దక్కకపోవడం జీర్ణించుకోలేని విషయమని ఆయన అన్నారు. జట్టు సభ్యుల నుంచి తను మరింత మెరుగైన ప్రదర్శనను కోరుకున్నానని వివరించారు. వాస్తవానికి ఇండియాలో సిరీస్ గెలుస్తామని అనుకోలేదని, అలా కోరితే అది అత్యాశే అవుతుందని అన్న జయసూర్య లంక జట్టు మరింత గట్టిగా పోరాడి ఉంటే బాగుండేదని అన్నారు.

  • Loading...

More Telugu News