: నారా లోకేష్ పై కేసు నమోదు చేయండి: రంగారెడ్డి జిల్లా కోర్టు
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వంపై, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి జిల్లా కోర్టులో తెలంగాణ జూనియర్ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.