: ప్రకాశం జిల్లా కనిగిరిలో భారీ చోరీ


బ్యాంకు నుంచి డబ్బు తీసుకొని వస్తుండగా అందరూ చూస్తుండగానే డబ్బులున్న బ్యాగ్ ను లాక్కొని పారిపోయిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. కనిగిరి ప్రధాన బజారులోని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వద్ద ఈ ఘటన జరిగింది. వెంకటరెడ్డి అనే వ్యక్తి నుంచి లక్షల నగదు ఉన్న బ్యాగ్ ను గుర్తు తెలియని దుండగులు లాక్కుపోయారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బ్యాంకు సీసీ కెమెరాలను, పక్కనే ఉన్న ఏటిఎంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News