: విజయాన్ని వెనిల్లా ఐస్ క్రీమ్ తో సెలబ్రేట్ చేసుకున్న బ్యాడ్మింటన్ తార


భారత బ్యాడ్మింటన్ రంగానికి అంతర్జాతీయ క్రీడా యవనికపై సమున్నత గుర్తింపు తెచ్చిన క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఈ హైాదరాబాదీ షట్లర్ సాధించిన విజయాల స్ఫూర్తిగా బాలలు ఎందరో బ్యాడ్మింటన్ బాటపట్టారంటే అతిశయోక్తి కాదు. గాయాల నుంచి కోలుకున్న సైనా గత కొంతకాలంగా ఫామ్ కనబరుస్తోంది. తాజాగా, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ చేజిక్కించుకుని సత్తా చాటింది. చైనా గడ్డపై సాధించిన ఈ విజయాన్ని సైనా ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి! ఫైనల్ మ్యాచ్ లో జపాన్ అమ్మాయి యమగుచిని చిత్తు చేసిన అనంతరం సింపుల్ గా ఓ వెనిల్లా ఐస్ క్రీమ్ లాగించేసింది. ఐస్ క్రీమ్ లను బాగా ఇష్టపడే సైనా, మ్యాచ్ ఫిట్ నెస్ కోసం టోర్నీల్లో వాటికి దూరంగా ఉంటుంది. టైటిల్ గెలిచిన ఆనందంలో ఆరోగ్య సూత్రాలన్నింటిని పక్కనబెట్టి మనసుకు నచ్చిన ఐస్ క్రీమ్ ను ఆరగించింది. కాగా, సైనా చైనా ఓపెన్ గురించి మాట్లాడుతూ, తొలుత ఈ టోర్నీలో ఆడకూడదని భావించానని, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత సమయం తక్కువగా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. అయితే, కోచ్ విమల్ ఒప్పించడంతో చాంపియన్ షిప్ బరిలో దిగానని వెల్లడించింది. ఇక, తన జీవితచరిత్రను తెరకెక్కిస్తే ఎవరైతే తన పాత్రకు బాగుంటారో కూడా చెప్పేసిందీ హైదరాబాదీ స్టార్. తడుముకోకుండా 'దీపికా పదుకొనే' అంటూ బదులిచ్చింది. దీపిక అయితే అతికినట్టు సరిపోతుందని, ఆమె గతంలో జాతీయస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడిందని సైనా వివరించింది. అంతే కాదండోయ్, తన బయో పిక్ లో దీపికకు జతగా షారుఖ్ అయితే ఓకే అని అభిప్రాయపడింది. వారిద్దరూ హిట్ పెయిర్ అని పేర్కొంది.

  • Loading...

More Telugu News