: ఏపీలో పోస్టింగ్ ఇవ్వాలంటూ సచివాలయం వద్ద ఇంజినీర్ల ధర్నా
తమకు ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగులు ఇవ్వాలంటూ ఏపీ సచివాలయం ప్రధాన గేటు ముందు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు నేడు ధర్నాకు దిగారు. 5, 6 జోన్లలో ఎంపికైన తమకు ఆంధ్రాలో పోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ జోన్‌లో మెరిట్‌తో ఉద్యోగాలు పొందామని, అయినా తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతూ విధులకు అనుమతించడం లేదని ఇంజినీర్లు ఆరోపించారు. ఇంజినీర్ల ఆందోళన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.