: టీఎన్జీవోలపై అశోక్ బాబు దుష్ప్రచారం చేస్తున్నారు: దేవీప్రసాద్
తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎన్జీవోలకు భద్రత లేదని, తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారనీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కావాలనే తెలంగాణ ఉద్యోగులపై ఇటువంటి ప్రచారం చేస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఎప్పుడూ ఏపీ ఉద్యోగులపై దాడులు జరగలేదని, ఇక రాష్ట్రం వచ్చాక ఎందుకు దాడి జరుగుతుందని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సంఘంలోని అంతర్గత కుమ్ములాటనుంచి బయటపడేందుకే అశోక్ బాబు ఈ నాటకాలు ఆడుతున్నారన్నారు.