: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాంపాల్ భక్తుల ధర్నా


హర్యానాలోని బాబా సంత్ రాంపాల్ ఆశ్రమం సత్ లోక్ పై పోలీసుల దాడికి నిరసనగా బాబా మద్దతుదారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆశ్రమంపై దాడి జరిగిందనే సమాచారం తెలియగానే ఢిల్లీలో దాదాపు వెయ్యి మందికి పైగా బాబా భక్తులు జంతర్ మంతర్ వద్ద పోగయ్యారు. ఆశ్రమంపై పోలీసు దాడిని ఖండిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసు చర్యకు నిరసనగా ప్లకార్డులు చేతబట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ధర్నాకు దిగిన వారిలో మహిళా భక్తులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News