: గుజరాతీలు దగాకోరులు: ములాయం సింగ్
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ గుజరాతీలపై తీవ్ర విమర్శలు చేశారు. వారు దగాకోరులని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాటల దాడి చేసిన ములాయం, "అన్ని రంగాలలోను అభివృద్ధి తీసుకువస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిపై ఆయన వెనక్కు తగ్గారు" అన్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ మహిళా సదస్సులో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతపై మోదీ అవాస్తవ హామీలు ఇచ్చారని ఆరోపించారు. 'మహిళా సాధికారత గురించి మాట్లాడే ఓ వ్యక్తి, ముందు తన భార్య ఎక్కడుందో తెలుసుకోవాలి' అని చురక అంటించారు.