: ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ మరో బహుమతి
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ కు మరో అరుదైన కానుకను ఇచ్చారు. భారత్ లో స్థిరపడిన ఆస్ట్రేలియా ప్రముఖ న్యాయవాది జాన్ లాంగ్ 1854లో ఝాన్సీ లక్ష్మీబాయి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీపై కోర్టులో వేసిన పిటిషన్ కాపీని టోనీకి బహుమతిగా అందించారు. కాన్ బెర్రా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనక ముందు ఆ కానుక సమర్పించారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ సందర్భంగా పిటిషన్ కాపీలను కూడా పోస్టు చేశారు.