: ఈ నెల 22న జమ్ము కాశ్మీర్ నుంచి మోదీ ఎన్నికల ప్రచారం
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21న తిరిగి భారత్ చేరుకుంటారు. ఆ మరుసటి రోజు అంటే 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని కిస్ట్వర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీనగర్, ఉదంపూర్ ప్రాంతాల్లో నిర్వహించే ర్యాలీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరడజను ర్యాలీల్లో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 87 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.