: 300 మంది వైద్యులకు ఎంసీఐ సమన్లు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) 300 మంది వైద్యులకు సమన్లు పంపింది. ఈ మేరకు వారిని ప్రశ్నించనుంది. అయితే, ఇప్పటికే వారిలో 166 మంది వైద్యులను ప్రశ్నించామని ఎంసీఐ చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, కేవలం ఆరోపణల ఆధారంగానే ప్రశ్నిస్తున్నట్టు తెలిపింది. అహ్మదాబాద్ లోని ఓ ఫార్మాస్యూటికల్ సంస్థకు చెందిన మందులను కొనే విధంగా మందుల చీటీలో సూచించేందుకు వైద్యులు లంచాలు తీసుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంసీఐ పైవిధంగా స్పందించింది.