: విపక్షాల వాయిదా తీర్మానాల తిరస్కరణ... గందరగోళం... 10 నిమిషాల వాయిదా


వాయిదా అనంతరం ప్రారంభమైన తెలంగాణ శాసనసభలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్, గిరిజన, ఆడ శిశువుల అమ్మకంపై సీపీఐ, అంగన్ వాడీ వర్కర్ల వేతనాల పెంపుపై సీపీఎం, పింఛన్లపై వైకాపా, అర్హులకు పింఛన్ల తిరస్కరణపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. దీంతో, సభలో మరోసారి గందరగోళం చెలరేగింది. అధికారంలో కొనసాగడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అర్హత లేదని కాంగ్రెస్ నేత జానారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో కొనసాగాలా? లేదా? అనేది నిర్ణయించాల్సింది ప్రజలే కాని కాంగ్రెస్ పార్టీ కాదని మంత్రి ఈటెల కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిలో సభను మరో 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News