: కేసీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం: కిషన్ రెడ్డి


ముఖ్యమంత్రి కేసీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఓ వైపు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే, సభకు హాజరుకాకుండా... సభ వెలుపలి నుంచే విధానపరమైన ప్రకటనలు చేస్తున్నారని కేసీఆర్ పై కిషన్ మండిపడ్డారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ వెలుపలి నుంచి విధానపరమైన ప్రకటనలు చేయరాదని రూల్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి తెలంగాణ రాష్ట్ర పక్షి, పుష్పం, జంతువు, చెట్టు పేర్లను కేసీఆర్ ప్రకటించారని... అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News