: నేడు బీసీసీఐ కీలక సమావేశం
ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక బహిర్గతమైన తరువాత తొలిసారిగా బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ నేడు చెన్నైలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ముద్గల్ కమిటీ నివేదికలోని అంశాలను, ఆపై బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం తేదీలను ఖరారు చేస్తారని సమాచారం. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీనివాసన్ కు ప్రమేయం లేదని తేలడంతో తిరిగి ఆయనకు పూర్తి బాధ్యతలను అప్పగించే విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.