: ఇండియాతో వాణిజ్య ఒప్పందం తదుపరి లక్ష్యం : ఆస్ట్రేలియా ప్రధాని


భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే తమ తదుపరి లక్ష్యమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. 2005 నుంచి చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపగా, ఇటీవలి జీ- 20 సదస్సులో సంతకాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మరో సంవత్సరంలోగా భారత్ తో ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మోదీ సైతం ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మేలు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News