: అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
తెలంగాణ అసెంబ్లీ మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా విపక్షాలు పలు అంశాలపై చర్చ కోసం స్పీకర్ కు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్, అర్హులకు పింఛన్ల తిరస్కరణపై బీజేపీ, గిరిజన ఆడ శిశువుల విక్రయాలపై సీపీఐ, అంగన్ వాడీ వర్కర్ల వేతనాలపై సీపీఎం, పింఛన్ల పంపిణీలపై వైకాపాలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ సోమవారం కూడా వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.