: హైదరాబాదులో రౌడీ షీటర్ పై దాడి
హైదరాబాద్ పాతబస్తీలో పేరుమోసిన రౌడీ షీటర్ ఫాజిల్ పై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. రాజేంద్ర నగర్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మంగళవారం ఉదయం ఆరాంఘర్ చౌరస్తా సమీపంలో ఫాజిల్ ను కొందరు దుండగులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫాజిల్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.