: మోదీ 'భారత్' నామస్మరణ చేస్తుంటే, చంద్రబాబు 'సింగపూర్' నామస్మరణ!: వైఎస్ఆర్ సీపీ
ప్రపంచ చిత్రపటంపై భారత్ ను నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం సింగపూర్ నామస్మరణ చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ దుయ్యబట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబుకు రహస్య అజెండా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మంగళవారం అన్నారు. 'రహస్య అజెండా'పై చర్చ జరగాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ డిమాండ్ చేశారు.