: రాజాబాబే మోసగాడట... యూటర్న్ తీసుకున్న బెజవాడ ఎన్నారై కిడ్నాప్ కేసు
విజయవాడ రియల్ మాఫియా అపహరించిందని భావిస్తున్న బెజవాడ ఎన్నారై రాజాబాబు కేసు యూటర్న్ తీసుకుంది. అతడిని రియల్ మాఫియా కిడ్నాప్ చేసిందని సోమవారం ఉదయం వార్తలు వెలువడ్డాయి. అయితే రెండు గంటలు గడిచేలోగానే అతడే మోసగాడని, అతడిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని తేలింది. అంతేకాక రియల్ ఎస్టేట్ పేరిట ఇద్దరు హైదరాబాదీలను మోసం చేసి రూ.30 లక్షల మేర కాజేశాడని వార్తలు ప్రసారమయ్యాయి. ఈ కేసులోనే అతడిని హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నిర్ధారణ అయ్యింది. నవ్యాంధ్ర రాజధాని సమీపంలో భూముల పేరు చెప్పి, రాజాబాబు మరో వ్యక్తితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు.