: తమిళనాడు మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ గా జస్టిస్ మీనాకుమారి


తమిళనాడు మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ గా జస్టిస్ మీనాకుమారి నియమితులయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య సిఫారసు మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ మీనాకుమారి, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు. హైదరాబాద్ లోనే న్యాయవాద వృత్తి జీవితం ప్రారంభించిన జస్టిస్ మీనా కుమారి, తమిళనాడు మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తొలి తెలుగు మహిళగా వినుతికెక్కనున్నారు.

  • Loading...

More Telugu News