: నేడు గవర్నర్ కు ఫిరాయింపుదారులపై టీ కాంగ్రెస్ ఫిర్యాదు


తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేటి సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకే వారు గవర్నర్ ను కలవనున్నారు. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పక్షం వ్యవహరించిన తీరుపైనా వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులపై చర్చ కోసం వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని సోమవారం శాసనసభ స్పీకర్ తిరస్కరించిన నేపథ్యంలో ఈ విషయంలో తాము ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడబోమని సభలో పార్టీ ఉప నేత జీవన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News