: నేడే ఫలక్ నూమా ప్యాలెస్ లో సల్మాన్ సోదరి వివాహం


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహం నేడు హైదరాబాద్ లోని ఫలక్ నూమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక కోసం వధూవరులు సహా సల్మాన్ కుటుంబం, స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు సోమవారం రాత్రికే హైదరాబాద్ చేరుకున్నారు. నేడు మరింత మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుక కోసం హైదరాబాద్ రానున్నారు. దీంతో నేడు హైదరాబాద్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కళకళలాడనుంది. అర్పిత వివాహం నేపథ్యంలో ఫలక్ నూమాకు సరికొత్త కళ వచ్చేసింది.

  • Loading...

More Telugu News