: ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం
ఆస్ట్రేలియా పార్లమెంట్ నుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్నారు. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. అక్కడ ప్రసంగించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. జీ-20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనలో కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఆయన ఆస్ట్రేలియాకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల తర్వాత భారత్ లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందన్న మోదీ, వాణిజ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాల్సి ఉందని ఆకాంక్షించారు.