: ఇదొక లేత లవ్ స్టోరీ!


సినిమాలు, టీవీలు యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్నదానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ ప్రైవేటు స్కూల్లో చదివే 13 ఏళ్ల అబ్బాయి, 12 ఏళ్ల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయారు. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోవడానికట. నైనిటాల్ వెళ్లి ఇద్దరం ఒక్కటవుదామని ఆ లేత ప్రాయంలో ఘాటైన నిర్ణయం తీసుకున్నారు. అబ్బాయి చదివేది ఎనిమిదో తరగతి, అమ్మాయి చదివేది ఏడో తరగతి... అయితేనేం, ప్రేమ పాఠాలు చక్కగానే వల్లెవేశారు. లేచిపోవడమే ప్రేమకు ముగింపు అనుకున్నారా అమాయకులు! నైనిటాల్ వెళ్లే క్రమంలో వారు బరేలీలో దిగారు. వారిద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఓ బ్యాంకు ఉద్యోగి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చి స్వస్థలం తరలించారు.

  • Loading...

More Telugu News